జనవరి నుండి మొదలుకానున్న బాలయ్య, ఎస్వీ కృష్ణారెడ్డిల చిత్రం ?

కెఎస్.రవికుమార్ డైరెక్షన్లో చేస్తున్న ‘జై సింహా’ సినిమా షూట్ పూర్తికావడంతో బాలకృష్ణ తన తర్వాతి సినిమాపై దృష్టిపెట్టారు. అది కూడా సీనియర్ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి డైరెక్షన్లో ఉండనుందని సమాచారం. ఇదివరకే తెలిపినట్టు కృష్ణారెడ్డిగారు చెప్పిన ఒక ఫాంటసీ కథ పట్ల ఇంప్రెస్ అయిన బాలయ్య దాన్నే తన తర్వాతి సినిమాగా చేసే యోచనలో ఉన్నారట.

ముందుగా అనుకున్న ప్రకారం అయితే బాలక్రిష్ణ తర్వాతి సినిమా తండ్రి ఎన్టీఆర్ బయోపిక్ ను తేజ డైరక్షన్లో చేయాల్సి ఉంది. కానీ తేజ ప్రసుతం వెంకటేష్ సినిమాను ప్రారంభించే పనిలో ఉండటం వలన ఇప్పుడప్పుడే ఆ బయోపిక్ మొదలయ్యే సూచనలు లేవు. అందుకే ఈ గ్యాప్లోనే కృష్ణారెడ్డి సినిమాను చేయాలని తలచిన బాలక్రిష్ణ జనవరిలో ఆ ప్రాజెక్టును లాంచ్ చేసే అవకాశాలున్నాయట. అయితే ఈ వార్తపై బాలక్రిష్ణ, కృష్ణారెడ్డిగార్ల నుండి ఇంకా అధికారిక సమాచారం వెలువడలేదు.