యువ నటుడు అక్కినేని నాగచైతన్య హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో ఒక మూవీ మాస్ రస్టిక్ లవ్, యాక్షన్ ఎంటర్టైనర్ రూపొందనున్న విషయం తెలిసిందే. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు నిర్మాతగా NC 23 వర్కింగ్ టైటిల్ తో రూపొందనున్న ఈ మూవీ ఇటీవల అనౌన్స్ మెంట్ దగ్గరి నుండి అందరిలో మంచి హైప్ ఏర్పరిచింది. ఇందులో నాగచైతన్య మత్స్యకారుడి పాత్ర చేస్తుండగా ఆయనకు జోడీగా యువ నటి సాయి పల్లవి నటించనున్నారు.
కాగా హీరోయిన్ కి సంబంధించి నేడు మేకర్స్ ఒక చిన్న వీడియో బైట్ ని రిలీజ్ చేసారు. అందులో సాయి పల్లవి పేస్ ని రివీల్ చేయనప్పటికీ పక్కాగా అది ఆమే అని తెలుస్తోంది. అయితే దీని పై వారి నుండి ప్రకటన అతి త్వరలో రానుంది. కాగా ఈ మూవీని శ్రీకాకుళం, విశాఖపట్నం, ఆమదాలవలస, గుజరాత్ వంటి ప్రాంతాల్లో గ్రాండ్ గా తెరకెక్కించనున్నారు. అలానే NC 23 కి సంబందించిన మరిన్ని వివరాలు అతి త్వరలో వెల్లడి కానున్నాయి.
https://x.com/GeethaArts/status/1704046416711291156?s=20