త్వరలో రిలీజ్ కానున్న ‘నీది నాది ఒకే కథ’ టీజర్ !

ఇటీవలే ‘మెంటల్ మదిలో’ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న హీరో శ్రీ విష్ణు చేస్తున్న చిత్రం ‘నీది నాది ఒకే కథ’. నూతన దర్శకుడు వేణు ఊడుగుల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం సైకలాజికల్ థ్రిల్లర్ గా ఉండనుంది. ఇటీవలే విడుదలైన మోషన్ పోస్టర్ కు మంచి స్పందన రాగా ఇప్పుడు టీజర్ ను సిద్ధం చేసే పనిలో పడ్డారు టీమ్.

ఈ టీజర్ ను జనవరి 6న రిలీజ్ చేయనున్నారు. ప్రశాంతి, కృష్ణ విజయ్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీవిష్ణు స్నేహితుడు, హీరో నారా రోహిత్ తన అరన్ మీడియా వర్క్స్ బ్యానర్ పై సమర్పిస్తున్నారు. సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో ‘బిచ్చగాడు’ ఫేమ్ సాట్నా టైటస్ హీరోయిన్ గా కనిపించనుంది.