మెగా ఫ్యాన్స్ కి సిసలైన పండుగ…ఆచార్య సెకండ్ సింగిల్ కి ముహూర్తం ఫిక్స్!

Published on Nov 2, 2021 11:19 am IST

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ఆచార్య. ఈ చిత్రం లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సిద్ద పాత్ర లో నటిస్తున్నారు. సిద్ధ పాత్ర కి సంబంధించిన లుక్ ఇప్పటికే విడుదల అయి ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ చిత్రం లో మెగా పవర్ స్టార్ రాంచరణ్ సరసన హీరోయిన్ గా పూజ హెగ్డే నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రం లో పూజ హెగ్డే నీలాంబరి పాత్ర ను పోషిస్తుంది. తాజాగా చిత్ర యూనిట్ వీరిద్దరికీ సంబందించిన మెలోడీ పై ఒక క్లారిటీ ఇచ్చింది.

ఈ చిత్రం నుండి రెండవ సింగిల్ కి ముహూర్తం ను ఫిక్స్ చేయడం జరిగింది. రెండవ సాంగ్ పూజా హెగ్డే రామ్ చరణ్ ల పై చిత్రీకరించినట్లు తెలుస్తోంది. నీలాంబరి అంటూ సాగే లిరికల్ వీడియో ను నవంబర్ 5 వ తేదీన ఉదయం 11:07 గంటలకు చిత్ర యూనిట్ విడుదల చేయనుంది. మరొక పక్క మెగాస్టార్ చిరంజీవి సరసన హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నటిస్తోంది. ఈ చిత్రానికి సంగీతం మణిశర్మ అందిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్ కంపనీ మరియు మాట్నీ ఎంటర్ టైన్మెంట్ పతాకం పై ఈ చిత్రాన్ని నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఫిబ్రవరి 4 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

సంబంధిత సమాచారం :

More