‘బింబిసార’ నుండి మూడవ సాంగ్ రిలీజ్

Published on Aug 1, 2022 11:30 pm IST

నందమూరి కళ్యాణ్ రామ్ లేటెస్ట్ మూవీ బింబిసార. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై ఎంతో భారీ స్థాయిలో కె హరికృష్ణ నిర్మించిన ఈ మూవీ ఆగష్టు 5న విడుదల కానుండగా మల్లిడి వశిష్ఠ దీనిని తెరకెక్కించారు. ఇటీవల రిలీజ్ అయిన ఈ సోషియో ఫాంటసీ మూవీ యొక్క థియేట్రీకల్ ట్రైలర్ అందరినీ ఎంతో ఆకట్టుకుని మూవీ పై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పరిచింది. చిరంతన్ భట్ మ్యూజిక్ అందించిన ఈ మూవీకి సీనియర్ మ్యూజిక్ డైరెక ఎం ఎం కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు.

క్యాథరిన్ త్రెసా, వరీన హుస్సేన్, సంయుక్తా మీనన్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ మూవీ నుండి ఇప్పటికే రెండు సాంగ్స్ రిలీజ్ అయి శ్రోతలను ఆకట్టుకోగా నేడు ఈ మూవీ నుండి నీతో ఉంటె చాలు అనే పల్లవితో సాగె సాంగ్ ని రిలీజ్ చేసారు. కీరవాణి కంపోజ్ చేసిన ఈ సాంగ్ ని మోహన భోగరాజు, శాండిల్య పీసపాటి పాడారు. ఎమోషనల్ వే లో సాగె ఈ సాంగ్ ప్రస్తుతం అందరినీ ఆకట్టుకుంటూ యూట్యూబ్ లో మంచి వ్యూస్ తో కొనసాగుతోంది. మరి అందరిలో ఎంతో భారీ అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ రిలీజ్ తరువాత ఎంత రేంజ్ సక్సెస్ అందుకుంటుందో చూడాలి.

సాంగ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :