‘రామ్ చరణ్’ సినిమాలో స్టార్ హీరో తల్లి ?

Published on Jun 20, 2022 5:05 pm IST

మెగా పవర్ స్టార్ ‘రామ్ చరణ్ తేజ్’ – విజువల్ ఇంద్రజాలికుడు శంకర్ కాంబినేషన్ లో రాబోతున్న పాన్ ఇండియా సినిమా గురించి తాజాగా ఒక ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వినిపిస్తోంది. పక్కా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో రాబోతున్న ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్ర ఉంది. ఈ పాత్రలో స్టార్ హీరో రణబీర్ కపూర్ తల్లి ‘నీతూ కపూర్’ నటించబోతుందని తెలుస్తోంది. ఆమెది పవర్ ఫుల్ రాజకీయ నాయకురాలి పాత్ర అట.

ఈ సినిమాలో కియారా అద్వానీని హీరోయిన్ గా నటిస్తోంది. భారీ బడ్జెట్ రాబోతున్న ఈ భారీ సినిమాలో మరో బాలీవుడ్ స్టార్ హీరో కూడా నటిస్తున్నారని తెలుస్తోంది. ఈ చిత్రంలో 20 నిమిషాల నిడివి కలిగిన ఓ పవర్ ఫుల్ పాత్ర ఉందట. ఇక సహజంగానే తన సినిమాల్లో హీరోల్ని డిఫరెంట్ గెటప్స్ అండ్ మేకప్స్ తో చూపించే ఆనవాయితీ ఉన్న శంకర్, ఈ భారీ సినిమాలో రామ్ చరణ్ ను కూడా చాల వినూత్నంగా చూపించబోతున్నాడట.

సంబంధిత సమాచారం :