పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్ !

Published on Oct 3, 2021 7:45 pm IST

బాలీవుడ్‌ ప్రముఖ నటి యాంకర్ నేహా ధూపియా ఈ రోజు పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిందని, తల్లీబిడ్డలిద్దరూ క్షేమంగా చాలా ఆరోగ్యంగా ఉన్నారని, నేహా ధూపియా భర్త నటుడు అంగడ్ బేడీ సోషల్ మీడియా ద్వారా తమ ఫాలోవర్స్ తో పంచుకున్నాడు. అయితే ఈ శుభవార్తను అయితే నేహా భర్త చెప్పాడు గాని, కొడుకు ఫొటోను మాత్రం రివీల్ చేయలేదు.

కాగా నేహా ధూపియా 2018లో అంగడ్ బేడీని పెళ్లి చేసుకొని, ఫ్యామిలీ లైఫ్ లోకి అడుగు పెట్టింది. అయితే, పెళ్ళైన ఏడాదికే అంగడ్ – నేహా జంటకు ఒక కూతురు పుట్టింది. ఇక ఇప్పుడు నేహా ధూపియా తన రెండో బేబీకి కూడా జన్మనివ్వడంతో హిందీ నెటిజన్లు ఆమెకు శుభాకాంక్షలు చెబుతున్నారు. అయితే నేహా ధూపియా వయసు ప్రస్తుతం 40 సంవత్సరాలు.

మిన్నారం అనే సినిమాతో చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ ఆరంభించిన నేహా తర్వాత జపనీస్‌ చిత్రంలో నటించింది. 2000 సంవత్సరంలో వచ్చిన ‘నిన్నే ఇష్టపడ్డాను’ చిత్రంతో టాలీవుడ్‌లో లక్‌ పరీక్షించుకుంది. అదే ఏడాది ‘ఖయామత్‌: సిటీ అండర్‌ త్రెట్‌’ చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది.

సంబంధిత సమాచారం :