సాహో షూట్ లో జాయిన్ అయిన నీల్ నితిన్!

ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా సాహో. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతుంది. భారీ తారాగణంలో ఏక కాలంలో తెలుగు, తమిళ, హిందీ భాషాల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ యాక్టర్ నీల్ నితిన్ ముఖేష్ విలన్ గా చేస్తున్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం సాహో షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది. తాజా ఈ సినిమా షూటింగ్ లో నీల్ నితిన్ జాయిన్ అయ్యాడు. ప్రస్తుతంలో సినిమాలో కొన్ని కీలక సన్నివేశాలని తెరకెక్కించే పనిలో దర్శకుడు సుజిత్ ఉన్నాడు. ఈ సినిమాని యూవీ క్రియేషన్స్ బ్యానర్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.