‘జైలర్ 2’ కోసం నెల్సన్ ప్లానింగ్.. ఈసారి మనోళ్లే..?

‘జైలర్ 2’ కోసం నెల్సన్ ప్లానింగ్.. ఈసారి మనోళ్లే..?

Published on Jan 16, 2025 10:01 PM IST

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషనల్ హిట్‌గా నిలిచిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు నెల్సన్ డైరెక్ట్ చేయగా పూర్తి యాక్షన్ ఎంట్‌టైనర్ మూవీగా ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఇక ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘జైలర్ 2’ని కూడా అనౌన్స్ చేశారు.

కేవలం అనౌన్స్‌మెంట్ టీజర్‌తోనే ‘జైలర్ 2’ సెన్సేషనల్ రెస్పాన్స్ అందుకుంది. అయితే, ఇప్పుడు ఈ సీక్వెల్ మూవీకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త వినిపిస్తోంది. ఈ సినిమాలో టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణ ఓ కీలక పాత్రలో నటించేందుకు ప్లాన్ చేస్తున్నాడట దర్శకుడు నెల్సన్. దీనికోసం ఓ పవర్‌ఫుల్ పాత్రను కూడా నెల్సన్ డిజైన్ చేశాడని.. త్వరలోనే బాలయ్యను ఈ సినిమాకు అంగీకరించేలా అతడు ప్లాన్ చేస్తున్నాడట.

అంతేగాక, ఇప్పుడు మరో కాప్ పాత్రలో నటించేందుకు ఓ తెలుగు యంగ్ హీరోను కూడా సిద్ధం చేయనున్నాడట నెల్సన్. ఇలా ‘జైలర్ 2’ మూవీ కోసం ఏకంగా ఇద్దరు తెలుగు హీరోలను రెడీ చేసేందుకు నెల్సన్ ప్లాన్ చేస్తుండటం ఇప్పుడు టాలీవుడ్ సినీ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు