షూటింగ్ పూర్తి చేసుకున్న రానా చిత్రం

షూటింగ్ పూర్తి చేసుకున్న రానా చిత్రం

Published on Jun 15, 2017 11:55 AM IST


రానా తాజా చిత్రం ‘నేనే రాజు నేనే మంత్రి’ టీజర్ మంచి ఆసక్తిని రేపుతోంది. ఈ చిత్రంలో రానా పొలిటీషియన్ గా నటిస్తున్నాడు. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర షూటింగ్ మొత్తం పూర్తైనట్లు తెలుస్తోంది.

పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి తేజ దర్శకత్వం వహిస్తున్నారు. కాజల్ హీరోయిన్ గా నటిస్తుండగా, కేథరిన్ ముఖ్య పాత్ర పోషిస్తోంది.సురేష్ ప్రొడక్షన్స్ నిర్మాణంలో ఈ చిత్రం తెరకెక్కుతుండటం విశేషం. చిత్ర ఆడియో మరియు విడుదల తేదీకి సంబందించిన విషయాలు త్వరలోనే వెల్లడవుతాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు