కిరణ్ అబ్బవరం “నేను మీకు బాగా కావాల్సినవాడిని” మూవీ లేటెస్ట్ అప్డేట్..!

Published on Mar 30, 2022 11:06 pm IST

యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు. ఇటీవల “సెబాస్టియ‌న్ పి.సి. 524” సినిమాతో ప్రేక్షకులను అలరించిన ఈ యంగ్ హీరో ప్రస్తుతం “నేను మీకు బాగా కావాల్సినవాడిని” అనే సినిమాలో నటిస్తున్నాడు. కుటుంబ కథా నేపధ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కోడి రామకృష్ణ కుమార్తె కోడి దివ్య దీప్తి నిర్మిస్తున్నారు.

అయితే ఈ సినిమాకి సంబంధించి తజాగా ఓ అప్డేట్ వచ్చింది. ఈ సినిమా నుంచి నుంచి “లాయర్ పాప” అనే ఫస్ట్ సింగిల్‌ని ఏప్రిల్ 2వ తేదిన విడుదల చేస్తున్నామని, మణిశర్మ మాస్ బీట్స్‌కి సిద్దంగా ఉండమని చిత్ర బృందం ప్రకటించింది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో కిరణ్ సరసన సంజనా ఆనంద్ హీరోయిన్‌గా నటిస్తుండగా, కార్తీక్ శంకర్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.

సంబంధిత సమాచారం :