వెరీ ఇంట్రెస్టింగ్ గా “నేను స్టూడెంట్ సర్” టీజర్.!

వెరీ ఇంట్రెస్టింగ్ గా “నేను స్టూడెంట్ సర్” టీజర్.!

Published on Nov 12, 2022 3:40 PM IST

రీసెంట్ గా టాలీవుడ్ లో పరిచయం అయ్యినటువంటి యంగ్ హీరో బెల్లంకొండ గణేష్. తన మొదటి సినిమా స్వాతి ముత్యం తోనే తన టాలెంట్ ప్రూవ్ చేసుకున్నాడు. ఇక ఇప్పుడు అయితే నెక్స్ట్ సినిమాగా “నేను స్టూడెంట్ సర్” అనే సినిమాతో తాను సిద్ధం కాగా ఇప్పుడు అయితే మేకర్స్ ఈ సినిమా టీజర్ ని అయితే రిలీజ్ చేశారు. అయితే స్వాతి ముత్యంలో డీసెంట్ గా కనిపించిన తాను ఈ సినిమాలో దానితో పాటు మంచి స్టైలిష్ లుక్స్ లో కనిపిస్తున్నాడు.

అలాగే ఈ సినిమా టీజర్ కూడా చాలా ఆసక్తి గొల్పే రేంజ్ లో కూడా ఉందని చెప్పి తీరాలి. ఒక ఐఫోన్ చుట్టూ తిరిగే ఓ క్రైమ్ థ్రిల్లర్ లా దర్శకుడు రాఖి ఉప్పలపాటి తెరకెక్కించిన విధానం చాలా బాగుంది. మూడ్ను టైటిల్ తో ఏదో రెగ్యులర్ కాలేజ్ డ్రామాలా ఉంటుంది అనుకునే వారిని డెఫినెట్ గా ఈ టీజర్ అయితే ఆశ్చర్య పరుస్తుంది. ఇక అలాగే ఇందులో మహతి సాగర్ మరోసారి తన మ్యూజిక్ తో సూపర్బ్ అవుట్ పుట్ అందించారు.

అలాగే సినిమాలో యాక్షన్ పోలీస్ గా వెర్సటైల్ సముద్రఖని పాత్ర కూడా ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తుంది. ఓవరాల్ గా అయితే ఈ చిత్రంతో గణేష్ మరింత మంచి సక్సెస్ అందుకునేలా కనిపిస్తున్నాడు. ఇక ఈ చిత్రానికి నాంది ప్రొడ్యూసర్ సతీష్ వర్మ నిర్మాణం వహించగా త్వరలోనే ఈ చిత్రం రిలీజ్ కానుంది.

టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు