“నేను స్టూడెంట్ సర్” టీజర్ రిలీజ్ కి రెడీ!

“నేను స్టూడెంట్ సర్” టీజర్ రిలీజ్ కి రెడీ!

Published on Nov 10, 2022 1:00 PM IST

నేను స్టూడెంట్ సర్ అనే యాక్షన్ థ్రిల్లర్ తో ప్రేక్షకులను అలరించేందుకు బెల్లంకొండ గణేష్ రెడీ అవుతున్నాడు. చాలా కాలంగా వార్తల్లో నిలిచిన ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా టీజర్ ఈ నెల 12న విడుదల కానుంది.

టీజర్ తేదీని వెల్లడించడానికి మేకర్స్ చిన్న ఆసక్తికరమైన ప్రోమోను విడుదల చేశారు. ఈ చిత్రంలో అవంతిక దాసాని కథానాయిక గా నటిస్తుంది. రాఖీ ఉప్పలపాటి దర్శకత్వంలో ఎస్‌వి2 ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నాంది ఫేం సతీష్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సునీల్ కీలక పాత్రలో కనిపించనున్నారు. మహతి స్వర సాగర్ మరియు అనిత్ మధాడి ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.

ప్రోమో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు