సస్పెన్స్ థ్రిల్లర్ ‘నెపోలియన్’ రిలీజ్ డేట్ ఫిక్స్ !
Published on Oct 31, 2017 2:40 pm IST

‘ప్రతినిధి’ సినిమాలో తన డైలాగ్స్ తో అందరిని ఆలోచింపచేసిన రచయిత ఆనంద్‌ రవి తన స్వీయ దర్శకత్వం లో తానే ప్రదాన పాత్ర పోషిస్తూ చేసిన సినిమా ‘నెపోలియన్’ . ఆచార్య క్రియేషన్స్ పతాకంపై వస్తున్న ఈ సినిమా ట్రైలర్ ఇటివల కాలంలో విడుదలై మంచి ఆదరణకు గురైంది. ట్రైలర్‌లోని సన్నివేశాలన్నీ ప్రేక్షకులను ఆసక్తి కల్పించాయి. సస్పెన్స్, థ్రిల్లింగ్, కామెడీ కలగలిపి ఉండటంతో ట్రైలర్ విపరీతంగా జనాలకు నచ్చింది.

‘ప్రతీ మిడిల్ క్లాస్ వాడికి సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, అలాంటి మిడిల్ క్లాస్ మనిషికి అన్యాయం జరిగేతే పరిస్థితి ఏంటి’ అనే పాయింట్ తో ఈ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు ఆనంద్ రవి. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. త్వరలో సెన్సార్ పూర్తి చేసుకోబోయే ఈ సినిమాను నవంబర్ 24 న విడుదల చెయ్యబోతున్నారు. మంచి కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్మకంతో ఉంది చిత్ర యూనిట్.

 
Like us on Facebook