కొత్త సంవత్సరం రావడంతోనే మళ్ళీ సందడి మొదలైంది. బాక్సాఫీస్ దగ్గర సంక్రాంతి సినిమాల హడావుడి కూడా ఆరంభం కాగా దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఎపుడు లానే తమ ఓటిటి కంటెంట్, ఈ ఏడాదిలో తమ దగ్గర ఉన్న కొత్త సినిమాల లిస్ట్ ఏంటి అనేది నెట్ ఫ్లిక్స్ పండగై (Netflix Pandigai) అంటూ రివీల్ చేశారు. మరి ఈ లిస్ట్ లో చిన్న పెద్ద అని తేడా లేకుండా యంగ్ అండ్ స్టార్ హీరోస్ సినిమాలు కూడా ఉన్నాయి. మరి వీటిలో తెలుగు ఆడియెన్స్ కి కూడా కొంచెం నోటెడ్ అయ్యిన సినిమాలు ఏంటి అనేవి చూద్దాం.
Suriya 2 movies – స్టార్ హీరో సూర్య రెండు సినిమాలు సొంతం
తమిళ విలక్షణ స్టార్ హీరోస్ లో సూర్య కూడా ఒకరు. మరి సూర్య నటిస్తున్న రెండు సినిమాలూ వీరే సొంతం చేసుకున్నారు. టాలీవుడ్ దర్శకుడు వెంకీ అట్లూరితో చేస్తున్న ఫ్యామిలీ డ్రామా సహా జీతూ మాధవన్ తెరకెక్కిస్తున్న పోలీస్ క్రైమ్ థ్రిల్లర్ (సూర్య కెరీర్ 44వ చిత్రం) లని నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్టు కన్ఫర్మ్ చేశారు.
Dhanush Upcoming films with Netflix – ధనుష్ వి కూడా రెండు సినిమాలు..
సూర్యతో పాటుగా ధనుష్ కూడా తెలుగు ఆడియెన్స్ కి బాగా పరిచయం మరి ధనుష్ నుంచి రానున్న రెండు సినిమాలు వీరే సొంతం చేసుకున్నట్టు కన్ఫర్మ్ చేశారు. దర్శకుడు రాజ్ కుమార్ పెరియసామి ధనుష్ కెరీర్ లో చేస్తున్న 55వ సినిమా, అలాగే దర్శకుడు విగ్నేష్ రాజా తెరకెక్కిస్తున్న చిత్రం ‘కర’. ఈ రెండు సినిమాలు కూడా నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్టు తెలిపారు.
కార్తీ థ్రిల్లర్, మట్టి కుస్తీ 2 కూడా
కార్తీ హీరోగా దర్శకుడు తమిళ్ అరసన్ చేస్తున్న థ్రిల్లర్ చిత్రం మార్షల్, అలాగే విష్ణు విశాల్, ఐశ్వర్య లెక్ష్మి నటించిన ఫ్యామిలీ స్పోర్ట్స్ డ్రామా మట్టి కుస్తీ కి సీక్వెల్ ని కూడా నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్నారు.
ఇక ఇవి కాకుండా యాక్షన్ కింగ్ అర్జున్ నటిస్తున్న కొత్త సినిమా అలాగే రవి మోహన్, ఎస్ జె సూర్య కలయికలో చేస్తున్న మరో చిత్రం ఇంకా యోగిబాబు నటిస్తున్న ఆర్డినరీ మ్యాన్ లాంటి కొంచెం నోటెడ్ ఫేస్ సినిమాలు కూడా నెట్ ఫ్లిక్స్ వారు సొంతం చేసుకున్నట్టు ప్రకటించారు. నేడు తమిళ్ లిస్ట్ రాగా రేపు తెలుగు వెర్షన్ లిస్ట్ రావచ్చు.
