మరోసారి రాజమౌళిని సంప్రదించిన నెట్ ఫ్లిక్స్… కారణం ఇదే!

మరోసారి రాజమౌళిని సంప్రదించిన నెట్ ఫ్లిక్స్… కారణం ఇదే!

Published on Jul 11, 2022 11:30 PM IST

జక్కన్న రాజమౌళి దర్శకత్వం లో తెరకెక్కిన RRR విడుదలైనప్పటి నుండి సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ఇప్పటికీ ఎంతోమంది హృదయాలను గెలుచుకున్న చిత్రం ఇది. ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో కొత్త రికార్డులను సృష్టించడం మాత్రమే కాకుండా, ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటుంది.

ఇప్పుడు, గాసిప్ ఏమిటంటే, నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ కంటెంట్‌ను రూపొందించడానికి రాజమౌళికి మరో ఆఫర్‌ను అందించింది. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. ఆ ఖచ్చితమైన ప్రాజెక్ట్ ఏది అనే దానిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. రాజమౌళి ఇంతకుముందు బాహుబలి నేపథ్య వెబ్ సిరీస్ కోసం నెట్‌ఫ్లిక్స్‌ తో జతకట్టారు, దానిని OTT దిగ్గజం స్క్రాప్ చేసింది. మరి ఈ కొత్త డీల్ ఏంటో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు