“బాహుబలి” సిరీస్‌ని పక్కకి పెట్టేసారా?

Published on Jan 25, 2022 2:00 am IST

ప్రభాస్, రానా, అనుష్క, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన చిత్రం “బాహుబలి”. రెండు భాగాలుగా తెరకెక్కించిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్ర ప్రేరణతో ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ‏ఫ్లిక్స్ “బాహుబలి: బిఫోర్ ది బిగినింగ్” పేరుతో ఓ వెబ్ సిరీస్‌ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు తమిళం హిందీ ఇంగ్లీష్ లతో పాటుగా పలు ఇతర భాషల్లో తొమ్మిది భాగాలుగా భారీ బడ్జెట్‌తో ఈ సిరీస్‌ని నిర్మించడానికి పూనుకుంది.

అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్‌ని పూర్తిగా పక్కన పెట్టేసినట్టు ప్రచారం జరుగుతుంది. 150 కోట్లు ఖర్చు పెట్టి దాదాపు 6 నెలల పాటు షూటింగ్ చేసిన తర్వాత అవుట్ ఫుట్ సంతృప్తికరంగా లేకపోవడంతో పూర్తిగా నిలిపివేయాలని, తిరిగి రీ షూట్ చేయాలని నెట్ ఫ్లిక్స్ డిసైడైనట్టు టాక్. అంతేకాదు బడ్జెట్ ని సవరించి టీమ్ మొత్తాన్ని మార్చేసారని, ఈ క్రమంలోనే కొత్త దర్శకులుగా కునాల్ దేశ్ ముఖ్ మరియు రిభు దాస్ గుప్తాలను బోర్డులోకి వచ్చి స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసారని, శివగామి పాత్ర కోసం వామిక గబ్బికి బదులుగా మృణాల్ ఠాకూర్‌ను ఎంపిక చేసారని సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :