హాలీవుడ్ మెగా డీల్ నుంచి తప్పుకున్న నెట్‌ఫ్లిక్స్: రాబోయే టాలీవుడ్ సినిమాల OTT మార్కెట్‌కు ఇది కలిసొచ్చే అంశమేనా?

Netflix Cancels WB Deal: A Big Boost for Tollywood OTT Market

  • మెగా డీల్ క్యాన్సిల్: వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ (WBD) సంస్థను $83 బిలియన్లకు కొనుగోలు చేయాల్సిన డీల్ నుంచి నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా తప్పుకుంది.
  • పారామౌంట్ ‘సూపీరియర్ ఆఫర్’: వార్నర్ బ్రదర్స్ మొత్తాన్ని కొనేందుకు పారామౌంట్ స్కైడ్యాన్స్ $111 బిలియన్ల భారీ ఆఫర్ ఇవ్వడంతో, ఫైనాన్షియల్ రిస్క్ తీసుకోలేక నెట్‌ఫ్లిక్స్ వెనక్కి తగ్గింది.
  • టాలీవుడ్ లింక్: ఈ డీల్ సక్సెస్ అవ్వడం వెనుక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడి ఉందని ఇండస్ట్రీ టాక్. మరోవైపు, డీల్ క్యాన్సిల్ అవ్వడం వల్ల మిగిలిన ఫండ్స్‌తో నెట్‌ఫ్లిక్స్ ఇండియా (ముఖ్యంగా టాలీవుడ్) కంటెంట్‌పై మరింత భారీగా ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంది.

ప్రపంచ ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీలో అతిపెద్ద టేకోవర్‌గా భావించిన ‘వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ (WBD)’ కొనుగోలు డీల్ అనూహ్య మలుపు తిరిగింది. ఈ మెగా డీల్ నుంచి ప్రముఖ స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ (Netflix) అధికారికంగా తప్పుకుంది. వార్నర్ బ్రదర్స్‌ను చేజిక్కించుకునేందుకు పారామౌంట్ స్కైడ్యాన్స్ (Paramount Skydance) ఏకంగా $111 బిలియన్లతో (షేర్‌కి $31 డాలర్లు) ముందుకొచ్చింది. ఈ ఆఫర్‌ను వార్నర్ బ్రదర్స్ బోర్డు ‘సూపీరియర్ ఆఫర్’ (Superior Proposal) గా ప్రకటించడంతో, రేసులో నిలవడం ఆర్థికంగా లాభసాటి కాదంటూ నెట్‌ఫ్లిక్స్ కో-సీఈవోలు టెడ్ సరండోస్, గ్రెగ్ పీటర్స్ స్పష్టం చేశారు.

నిజానికి గత డిసెంబర్‌లో వార్నర్ బ్రదర్స్ స్టూడియోస్, స్ట్రీమింగ్ విభాగాలను $83 బిలియన్లకు (సుమారు రూ.7 లక్షల కోట్లు ) కొనుగోలు చేసేందుకు నెట్‌ఫ్లిక్స్ అగ్రిమెంట్ చేసుకుంది. అయితే పారామౌంట్ సంస్థ మాత్రం కేవలం స్టూడియోస్ మాత్రమే కాకుండా, ఏకంగా WBD కంపెనీ మొత్తాన్ని (CNN, Discovery, HBO లాంటి ఛానెల్స్‌తో సహా) కొనేందుకు ఆల్-క్యాష్ ఆఫర్ ప్రకటించింది. ఈ ఆఫర్‌ను మ్యాచ్ చేయడానికి నెట్‌ఫ్లిక్స్‌కు 4 రోజుల గడువు ఇచ్చినప్పటికీ, ఫైనాన్షియల్ క్రమశిక్షణ పాటించాలనే ఉద్దేశ్యంతో నెట్‌ఫ్లిక్స్ ఈ రేసు నుంచి డ్రాప్ అయ్యింది. ఆసక్తికరంగా, ఈ భారీ అప్పుల డీల్ నుంచి నెట్‌ఫ్లిక్స్ తప్పుకోవడాన్ని వాల్ స్ట్రీట్ ఇన్వెస్టర్లు స్వాగతించారు. దీంతో మార్కెట్‌లో నెట్‌ఫ్లిక్స్ షేర్లు వెంటనే 9% వరకు ఎగబాకాయి.

ఈ  డీల్ వెనుక అసలు కథ:

ఈ ఎంటర్‌టైన్‌మెంట్ వార్ వెనుక అమెరికా పాలిటిక్స్ ముడిపడి ఉండటం గమనార్హం. పారామౌంట్ సీఈవో డేవిడ్ ఎల్లిసన్ తండ్రి లారీ ఎల్లిసన్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు అత్యంత సన్నిహితుడు. ట్రంప్ తీవ్రంగా వ్యతిరేకించే ‘CNN’ న్యూస్ ఛానెల్ వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ చేతిలో ఉంది. ఇప్పుడు పారామౌంట్ ఈ కంపెనీని కొనుగోలు చేయడం ద్వారా, పరోక్షంగా ఆ నెట్‌వర్క్‌పై ట్రంప్ మద్దతుదారుల కంట్రోల్ రాబోతుందనేది వాషింగ్టన్ వర్గాల విశ్లేషణ. అంతేకాకుండా, హ్యారీ పోటర్, డీసీ మూవీస్ (బ్యాట్‌మ్యాన్, సూపర్‌మ్యాన్), గేమ్ ఆఫ్ థ్రోన్స్ లాంటి పాపులర్ ఫ్రాంచైజీలు కూడా ఇక పారామౌంట్ గుప్పెట్లోకి వెళ్లనున్నాయి.

టాలీవుడ్ ప్రేక్షకులకు దీని వల్ల ఇంపాక్ట్ ఏంటి?:

ఈ హాలీవుడ్ డీల్ క్యాన్సిలేషన్ పరోక్షంగా టాలీవుడ్‌కి పెద్ద ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది. $83 బిలియన్ల (లక్షల కోట్లు) భారీ పెట్టుబడి నుంచి నెట్‌ఫ్లిక్స్ సేవ్ అయ్యింది. నెట్‌ఫ్లిక్స్ తన పాత స్ట్రాటజీ అయిన ‘గ్లోబల్ సబ్‌స్క్రైబర్ గ్రోత్’ పైనే ఫోకస్ పెడుతున్నట్లు స్పష్టమైంది. అంటే, ఇండియా లాంటి మార్కెట్లలో రీజనల్ కంటెంట్ కోసం బడ్జెట్ పెంచే అవకాశం పుష్కలంగా ఉంది. ఇప్పటికే తెలుగు సినిమా (Tollywood) పోస్ట్-థియేట్రికల్ డిజిటల్ రైట్స్ మార్కెట్‌లో నెట్‌ఫ్లిక్స్ హవా నడుస్తోంది. ఇప్పుడు డీల్ క్యాన్సిల్ అవ్వడంతో తమ వద్ద ఉన్న రిజర్వ్ ఫండ్స్‌తో రాబోయే ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ లాంటి పాన్-ఇండియా హీరోల సినిమాల స్ట్రీమింగ్ రైట్స్ కోసం నెట్‌ఫ్లిక్స్ ఇండియా కళ్లు చెదిరే ఆఫర్స్ ఇచ్చే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

నెక్స్ట్ ఏంటి?:

నెట్‌ఫ్లిక్స్ డ్రాప్ అవ్వడంతో, వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ – పారామౌంట్ మెర్జర్ డీల్ దాదాపు ఖరారైనట్లే. WBD బోర్డు అప్రూవల్, అమెరికా రెగ్యులేటరీ ఏజెన్సీల యాంటీ-ట్రస్ట్ క్లియరెన్స్ పూర్తయిన తర్వాత ఈ రెండు హాలీవుడ్ దిగ్గజాల విలీనం అధికారికంగా పూర్తి కానుంది.

Exit mobile version