క్రేజీ..”RRR” ని మిస్సవ్వద్దంటున్న నెట్ ఫ్లిక్స్ సీఈఓ..!

Published on Jul 3, 2022 9:00 am IST


లేటెస్ట్ గా వచ్చిన పాన్ ఇండియా సెన్సేషన్ చిత్రాల్లో మన తెలుగు నుంచి వచ్చిన భారీ పాన్ ఇండియా మల్టీ స్టారర్ చిత్రం “రౌద్రం రణం రుధిరం” కూడా ఒకటి. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హీరోలుగా దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ హిస్టారిక్ యాక్షన్ డ్రామా ఇప్పుడు ఓటిటి లో వచ్చాక ప్రపంచ వ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది.

నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయ్యి ఇప్పుడు వరల్డ్ వైడ్ భారీ రీచ్ ని కైవసం చేసుకున్న ఈ చిత్రాన్ని ఇప్పుడు ఏకంగా నెట్ ఫ్లిక్స్ సీఈఓ అయినటువంటి టెడ్ సెరండోస్ ని కూడా మెప్పించింది. దీనితో తాను తన సోషల్ మీడియాలో ఈ సినిమా కోసం ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టడం వైరల్ గా మారింది. మీరు ఇంకా ఈ క్రేజీయెస్ట్ RRR ని చూడలేదా? చూడకపోతే తప్పకుండా చూడండి. మంచి థ్రిల్ రైడ్ ని ఈ ఏడాదిలో ఈ చిత్రం మీకు అందిస్తుంది నెట్ ఫ్లిక్స్ లో ఉన్న ఈ చిత్రానికి తప్పకుండా చూడండి అంటూ పోస్ట్ చేయడం ఆసక్తిగా మారింది.

సంబంధిత సమాచారం :