తమ స్ట్రీమింగ్ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న “నెట్ ఫ్లిక్స్” సంస్థ.?

Published on May 25, 2022 10:08 am IST


ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థలలో భారీ మొత్తంలో సబ్ స్క్రైబర్ లు ఉన్న సంస్థ నెట్ ఫ్లిక్స్ కూడా ఒకటి. అయితే వీరి నుంచి ఎన్నో పాపులర్ వెబ్ సిరీస్ లు అలాగే మరెన్నో పాపులర్ సినిమాలు యూజర్స్ కి అందుబాటులో ఉంటాయి. ఇప్పటికి కూడా అపారమైన ఎంటర్టైన్మెంట్ ని అందిస్తూ ఈ సంస్థ టాప్ ప్లేస్ లో దూసుకెళ్తుంది. అయితే నెట్ ఫ్లిక్స్ మన దేశంలో మినహా ఇతర పలు దేశాల్లో తమ సబ్ స్క్రిప్షన్ ను భారీ ధరలు పెట్టారని ఆ మధ్య మిలియన్స్ కొద్దీ నెట్ ఫ్లిక్స్ నుంచి తప్పుకున్నారు.

దీనితో వారికి కోటాను కోట్ల నష్టం వచ్చింది అని ఆ మధ్య ఓటీటీ విశ్లేషకులు తెలిపారు. అయితే ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ ఈ నష్టాలను భర్తీ చెయ్యడానికి సిద్ధం అవుతుందని తెలుస్తోంది. అందులో భాగంగానే ఈసారి తమ కంటెంట్ స్ట్రీమింగ్ లో కొన్ని యాడ్స్ ని ప్లే చెయ్యనున్నారట. వీటితో ఆ నష్టాలను భర్తీ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. అయితే ఇది పూర్తి స్థాయిలో అమలు లోకి వస్తే వీక్షకుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి. ప్రస్తుతం అయితే రానున్న రోజుల్లో అనేక కొత్త సినిమాలు అలాగే సిరీస్ లు సిద్ధంగా ఉన్నాయి.

సంబంధిత సమాచారం :