బిగ్ బాస్ 5 : ఈ కంటెస్టెంట్ వేరియేషన్స్ పై నెటిజన్స్ ట్రోల్స్!

Published on Sep 11, 2021 12:01 pm IST

తెలుగు స్మాల్ స్క్రీన్ ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న బిగ్గెస్ట్ గ్రాండ్ రియాలిటీ షో బిగ్ బాస్ గత వారమే మళ్ళీ కింగ్ నాగార్జున హోస్టింగ్ తో మళ్ళీ స్టార్ట్ అయ్యింది. మరి మోస్ట్ అవైటెడ్ గా స్టార్ట్ అయ్యిన ఈ షోలో హౌస్ మేట్స్ బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టిన మొదటి రోజు నుంచే మంచి హీట్ వాతావరణం సృష్టించారు. మరి షో ఫాలోవర్స్ లో కొంతమంది కంటెస్టెంట్స్ మాత్రం తమ చేష్టలతో ఆల్రెడీ నోటెడ్ అయ్యారు.

అయితే వారిలో పాజిటివిటీ తెచ్చుకున్న వారు ఉన్న విపరీతంగా నెగిటివిటి కూడా తెచ్చుకున్న వారూ లేకపోలేరు. అయితే లేటెస్ట్ గా ఈ షో వీక్షించే ఆడియెన్స్ పల్స్ ప్రకారం ఓ కంటెస్టెంట్ ఆట తీరుపై నెటిజన్స్ బాగా నెగిటివ్ ఫీల్ అవుతున్నారు. ఆమెనే ఆర్ జె కాజల్.. మొదటి నుంచి ఈమె హౌస్ లో కాస్త యాక్టీవ్ గానే ఉంది కానీ కాస్తా ఇపుడు హైపర్ యాక్టీవ్ గా మారుతుండడంతో ఈమె పట్ల నెటిజన్స్ లో భిన్నాభిప్రాయాలు ఏర్పడుతున్నాయి.

నిన్నటి ఎపిసోడ్ లో కూడా ఆమె అప్పటికప్పుడే వేరియేషన్స్ మార్చేయడంపై కూడా హాట్ టాపిక్ గా మాట్లాడుకుంటున్నారు. అంతే కాకుండా ఆమె వంట ప్రోగ్రాం తీసుకున్నపుడు దానిని కూడా తన ఇన్స్టా పేజ్ నుంచి డిలీట్ చేయడంపై కామెంట్స్ చేస్తున్నారు. ఇలా ఈమెపై మాత్రం షో ఫాలోవర్స్ లో కాస్త ఇరిటేషన్ బాగా ఉంది.. ఇక ముందు రోజుల్లో ఏం జరగనుందో చూడాలి మరి.

సంబంధిత సమాచారం :