నెవర్ బిఫోర్ మహేష్ గ్యారెంటీ..మేకర్స్ సాలిడ్ క్లారిటీ.!

Published on Apr 26, 2022 8:03 am IST


మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా దర్శకుడు పరశురాం పెట్ల తెరకెక్కిస్తున్న సాలిడ్ మాస్ అండ్ స్టైలిష్ ఎంటర్టైనర్ “సర్కారు వారి పాట” కోసం అందరికీ తెలిసిందే. మహేష్ నుంచి చాలా కాలం తర్వాత వస్తున్న ఈ సినిమా కోసం అభిమానులు చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు.

మరి ఈ సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన ప్రతి అప్డేట్ మరియు పాట ఎక్కడా అభిమానులని అయితే నిరాశ పరచలేదు. ఇక లేటెస్ట్ గా ఈ సినిమా సంగీత దర్శకుడు థమన్ లాస్ట్ సాంగ్ పై క్రేజీ అప్డేట్ ఇస్తూ ఈ సాంగ్ ఈ ఏడాదికి మాస్ సాంగ్ ఆఫ్ ద ఇయర్ గా నిలిచిపోతుంది అని హైప్ ఎక్కిస్తున్నాడు.

ఇక అలాగే ఈ సాంగ్ మరియు లుక్స్ పై అయితే సినిమా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ కూడా కీలక అప్డేట్ ఇచ్చారు. మరి ఈ సాంగ్ మెంటల్ మాస్ గా ఉండగా సూపర్ స్టార్ మహేష్ ని అయితే నెవర్ బిఫోర్ గా చూస్తారని అంటున్నారు. దీనితో అభిమానుల్లో అయితే మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ సాంగ్ అయితే ఉంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం :