నా కెరీర్‌లో ఎప్పుడూ నిరాశ, నిస్పృహలకు గురికాలేదు – మాస్ మహారాజా రవితేజ

Published on Mar 25, 2023 9:30 pm IST

టాలీవుడ్ లో ప్రస్తుతం స్టార్ హీరోగా ఆడియన్స్ నుండి మంచి క్రేజ్ తో పలు సక్సెస్ లతో దూసుకెళ్తున్న వారిలో మాస్ మహారాజా రవితేజ కూడా ఒకరు. తన సినీ కెరీర్ తొలి రోజుల్లో మొదట అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసి ఆ తరువాత తన టాలెంట్ తో హీరోగా మెల్లగా ఒక్కొక్క అవకాశం అందుకుని దూసుకెళ్లారు రవితేజ. ఇటీవల త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన ధమాకా మూవీతో కెరీర్ పరంగా పెద్ద సక్సెస్ సొంతం చేసుకుని మంచి జోష్ మీదున్న రవితేజ అతి త్వరలో యాక్షన్ థ్రిల్లింగ్ మూవీ రావణాసుర ద్వారా ప్రేక్షకాభిమానుల ముందుకి వచ్చేందుకు సిద్ధం అవుతున్నారు.

కాగా ఇటీవల నానితో జరిగిన ఇంటరాక్షన్‌లో భాగంగా ఆయన మాట్లాడుతూ, తాను ఏ విషయాన్ని కూడా సీరియస్‌గా తీసుకోనని, అలానే నిర్ణయం తీసుకున్న తర్వాత పెద్దగా ఆలోచించనని రవితేజ పేర్కొన్నారు. పరిశ్రమలోకి ప్రవేశించడానికి మొదట్లో తాను ఎదుర్కొన్న కష్టాలను రవితేజ వివరించారు. అయితే తన కెరీర్‌లో తాను ఎప్పుడూ నిరాశ చెందలేదని తెలిపారు. మొదటి నుండి కూడా నా పని నేను చేసుకుంటూ ముందుకు వెళ్లడమే నాకు తెలుసు అని రవితేజ అన్నారు. ఇక తాను ఏం చేసినా తన పై పూర్తి నమ్మకంతో చేస్తానని, నిన్నే పెళ్లాడతా సినిమా కోసం తన ఫస్ట్ పే చెక్ ఇచ్చింది నాగార్జునే అని రవితేజ అప్పటి రోజులని గుర్తుచేసుకున్నారు.

సంబంధిత సమాచారం :