పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇటీవల రిలీజ్ అయిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘కపుల్ ఫ్రెండ్లీ’ ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సంతోష్ శోభన్, మానస వారణాసి తో కలిసి ప్రభాస్ చేసిన ఈ ఇంటర్వ్యూలో డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు డార్లింగ్. ఒక హీరో పాత్రకు పూరీ జగన్నాధ్‌లా మాస్ ఎలివేషన్ ఇచ్చే డైరెక్టర్ మరొకరు లేరు అంటూ ప్రభాస్ ప్రశంసలు కురిపించాడు.
అయితే, ఇప్పుడు ఈ కామెంట్స్ టాలీవుడ్‌లో కొత్త చర్చకు దారీ తీశాయి. పూరీపై ఎంతటి అభిమానం ఉంటే, ప్రభాస్ ఇలాంటి కామెంట్స్ చేస్తాడని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. ఇక పూరీ కూడా తనదైన రైటింగ్‌తో ఓ పక్కా స్క్రిప్టును రెడీ చేసి ప్రభాస్‌కు వినిపిస్తే, ఈ కాంబినేషన్ సెట్ కావడం చిటికెలో పని అంటూ పలువురు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘బుజ్జిగాడు’, ‘ఏక్ నిరంజన్’ సినిమాలు మాస్ ఆడియన్స్‌ను మెప్పించాయి. మరోసారి ఈ కాంబో సెట్ అయితే, ఒక మాస్ డైరెక్టర్ మరియు ఒక గ్లోబల్ స్టార్ కలిస్తే బాక్సాఫీస్ రికార్డులు తిరగరాయడం ఖాయం.
