మహేష్ 23 ఫస్ట్ లుక్, ఆడియో రిలీజ్ డేట్స్ !

22nd, March 2017 - 06:35:14 PM


ప్రస్తుతం మహేష్ బాబు అభిమానులు చాలా వేడి మీదున్నారు. దర్శకుడు మురుగదాస్ తో సినిమా మొదలై ఇన్నాళ్లు కావొస్తున్నా ఫస్ట్ లుక్, కనీసం టైటిల్ ఏమిటో కూడా బయటకి చెప్పకపోవడంతో కాస్త నిరుత్సాహానికి గురవుతున్నారు. ఇలాంటి తరుణంలోనే వాళ్లకు కాస్త ఊరటను కలిగించే వార్త ఒకటి బయటికొచ్చింది. అదేమిటంటే ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్, టైటిల్, ఆడియో వేడుక తేదీలు దాదాపుగా నిర్ణయించబడ్డాయట. ముందుగా ఫస్ట్ లుక్ ను ఉగాది రోజున విడుదల చేస్తారట. దాంతో పాటే టైటిల్ ఏమిటనేది కూడా రివీల్ చేస్తారట.

అలాగే ఆడియో వేడుకను మే 28వ తేదీన హైదరాబాద్లో భారీ ఎత్తున నిర్వహిస్తారని కూడా అంటున్నారు. అయితే గతంలో కూడా ఇలాంటి వార్తలే వినిపించి తర్వాత అవి పుకార్లేనని తేలిపోయిన నైపథ్యంలో సినీ వర్గాల్లో వినిపిస్తున్న ఈ వార్తలపై కాస్త క్లారిటీ కోసం సమయం వేచి చూడాల్సిందే. ఇకపోతే రకుల్ ప్రీత్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి హరీశ్ జైరాజ్ సంగీతం అందిస్తుండగా ఎస్. జె సూర్య ప్రతి నాయకుడి పాత్రలో నటిస్తున్నారు.