RC16 టైటిల్‌పై కొత్త బజ్

RC16 టైటిల్‌పై కొత్త బజ్

Published on Feb 11, 2025 9:00 PM IST

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీని దర్శకుడు బుచ్చిబాబు సానా డైరెక్ట్ చేస్తున్నాడు. RC16 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాను పూర్తి స్పోర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ సరికొత్త లుక్‌లో కనిపించనున్నాడు. ఇప్పటికే షూటింగ్‌లో కూడా పాల్గొంటున్నాడు చరణ్. అయితే, ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త సినీ సర్కిల్స్‌లో జోరుగా వినిపిస్తోంది.

ఈ సినిమాకు ‘పవర్ క్రికెట్’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారట మేకర్స్. ఈ సినిమా కథ క్రికెట్ ఆట చుట్టూ తిరుగుతుందని.. అందుకే ఈ టైటిల్ అయితే యాప్ట్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారట. ఇక ఈ సినిమాలో కుస్తీకి సంబంధించిన నేపథ్యం కూడా ఉండనుందని తెలుస్తోంది. మరి నిజంగానే ఈ సినిమాకు పవర్ క్రికెట్ అనే టైటిల్‌ను ఫిక్స్ చేస్తారా.. అనేది చూడాలి.

ఈ సినిమాలో అందాల భామ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండటంతో ఈ మూవీ పై అంచనాలు భారీగా క్రియేట్ అయ్యాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు