బజ్..”సర్కారు” నుంచి మాస్ ట్రీట్ కన్ఫర్మ్ అయ్యిందా.?

Published on Jul 25, 2021 6:00 pm IST


ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తీ సురేష్ హీరోయిన్ గా దర్శకుడు పరశురాం పెట్ల దర్శకత్వంలో “సర్కారు వారి పాట” అనే పక్కా మాస్ ఎంటర్టైనెర్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. భారీ అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రం నుంచి ఇంకొన్ని రోజుల్లో రాబోయే అదిరే ట్రీట్ కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఆల్రెడీ ఫస్ట్ లుక్ పోస్టర్ కన్ఫర్మ్ కాగా అదే మహేష్ బర్త్ డే కి మరో మాస్ ట్రీట్ కన్ఫర్మ్ అయ్యినట్టు తెలుస్తుంది.

అదే ఈ సినిమా నుంచి టీజర్.. మరి దీనిపై స్ట్రాంగ్ బజ్ ఇపుడు వినిపిస్తుంది. మేకర్స్ మహేష్ బర్త్ డే స్పెషల్ గా మంచి మాస్ టీజర్ కట్ ని రిలీజ్ చేసే యోచనలో ఉన్నారట. మరి ఇంకా కొన్ని రోజులు మాత్రమే బ్యాలన్స్ ఉన్న ఈ అప్డేట్ పై అధికారిక అప్డేట్ ఎప్పుడు రానుందో చూడాలి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :