‘స్పైడర్’ టీజర్ రిలీజ్ డేట్ అదేనా ?


సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం ‘స్పైడర్’ ముగింపు దశకు చేరుకుంది. కేవలం ఒక పాత మినహా మిగతా షూటింగ్ మొత్తం పూర్తైపోవడంతో మహేష్ బ్రేకేజ్ తీసుకుని కుటుంబంతో కలిసి హాలీడే ట్రిప్ కు కూడా వెళ్లారు. మహేష్ హాలీడే నుండి తిరిగి రాగానే ఆ పాటను కూడా పూర్తి చేస్తారట. ఇకపోతే ఈ సినిమా యొక్క టీజర్ ను మే 31వ తేదీ సూపర్ స్టార్ క్రిష్ణ పుట్టినరోజు సందర్బంగా రిలీజ్ చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి.

అలాగే సినిమాని ఆగస్ట్ రెండవ వారంలో విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారట నిర్మాతలు. అయితే ఈ వార్తలపై స్పైడర్ టీమ్ నుండి ఇంకా ఎలాంటి అధికారిక ప్రటకటన వెలువడలేదు. సౌత్ ఇండియన్ స్టార్ దర్శకుల్లో ఒకరైన మురుగదాస్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో మహేష్ ఐబీ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. హారీశ్ జైరాజ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది.