లేటెస్ట్..అవైటెడ్ “RRR” ట్రైలర్ కి కొత్త డేట్ కి ఫిక్స్.!

Published on Dec 2, 2021 8:00 am IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హీరోలుగా దర్శక ధీరుడు రాజమౌళి చేపట్టిన మూడేళ్ళ మహా యాగం “రౌద్రం రణం రుధిరం”. భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ పాన్ ఇండియన్ బిగ్గెస్ట్ విజువల్ ట్రీట్ వచ్చే ఏడాది రిలీజ్ కి రెడీగా ఉంది.

అయితే సినిమాకి సంబంధించిన మోస్ట్ అవైటెడ్ ట్రైలర్ ని చిత్ర యూనిట్ మొదట ఈ డిసెంబర్ 3కి ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే కానీ పలు కారణాల చేత దానిని వాయిదా వేశారు. ఇక ఇప్పుడు ఈ కొత్త డేట్ ఎప్పుడు అనేదానిపై లేటెస్ట్ సమాచారం వినిపిస్తుంది.

దీని ప్రకారం వచ్చే డిసెంబర్ 7 న కానీ 9 న కానీ రిలీజ్ చేయనున్నట్టు సమాచారం. ఈ రెండు డేట్స్ లో ఏదొక డేట్ న ట్రైలర్ ఫిక్స్ అయ్యినట్టుగా సినీ వర్గాల నుంచి వినికిడి. మరి దీనిపై అధికారిక క్లారిటీ ఎప్పుడు ఇస్తారో చూడాలి.

సంబంధిత సమాచారం :