‘పుష్ప’ డేట్ ఫిక్స్ అయినా..ఈ డౌట్ కి క్లారిటీ.?

Published on Oct 3, 2021 9:00 am IST


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా నటుడు ఫహద్ ఫాజిల్ సాలిడ్ విలన్ రోల్ లో నటిస్తున్న చిత్రం “పుష్ప”. విజనరీ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ భారీ చిత్రం పాన్ ఇండియన్ లెవెల్లో మంచి బజ్ లో ఇప్పుడు ఉంది. అయితే రీసెంట్ గానే ఈ సినిమా రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసేసిన మేకర్స్ వచ్చే డిసెంబర్ 17న ఈ సినిమా థియేటర్స్ లో పడుతుంది అని అధికారికంగా చెప్పారు.

కానీ ఇక్కడే చిన్న డౌట్ స్టార్ట్ అయ్యింది. తన సినిమా డేట్ పై బన్నీ నే ఎలాంటి పోస్ట్ కూడా తన ఏ సోషల్ మీడియా నుంచి పోస్ట్ చెయ్యకపోవడం ఆసక్తిగా మారింది. అధికారికంగా సినిమా యూనిట్ ప్రకటించింది కానీ బన్నీ ఎందుకు డేట్ పై పోస్ట్ చెయ్యలేదు అని అభిమానుల్లోనే చిన్నగా డౌటానుమానం మొదలయ్యింది. ఇక దీనిపై ఏమన్నా క్లారిటీ వస్తుందేమో చూడాలి.

సంబంధిత సమాచారం :