సంఘమిత్రలో నటిస్తున్నందుకు ఆనందంగా ఉందన్న హీరోయిన్ !
Published on Oct 21, 2017 5:37 pm IST


తమిళంలో భారీ చారిత్రక సినిమా తీయాలన్న లక్ష్యంతో దర్శకుడు సుందర్‌ సి. చేపట్టిన ‘సంఘమిత్ర’ ప్రాజెక్ట్ నుండిశ్రుతిహాసన్ అనూహ్యంగా వైదొలగారు. ఆ తరువాత చాలామంది హీరోయిన్స్ పేర్లు వినిపించాయి.కాని చివరికి దిశా పటాని ఈ సినిమాలో ప్రదాన పాత్రకి ఎంపిక అయ్యింది. ‘సంఘమిత్ర’సినిమా కోసం భారీగా డేట్స్ అవసరం ఉండటంతో దర్శకుడు సుందర్ సి దిశా పటానిని ఎంపిక చేసుకున్నాడని తెలుస్తుంది.

ఆస్కార్ అవార్డు విన్నర్ ఎ.ఆర్.రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.చారిత్రాత్మక చిత్రంగా తెరకెక్కుతున్న సంఘమిత్ర సినిమా పై మంచి అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో దిశాపటాని నటించడం పట్ల తను ఆనందం వెక్తం చేసింది. ఈ ప్రాజెక్ట్ కు సంభందించిన పూర్తీ సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సి ఉంది.

 
Like us on Facebook