ఎన్టీఆర్ పై డ్రాగన్‌ యాక్షన్ ఎపిసోడ్ ?

ఎన్టీఆర్ పై డ్రాగన్‌ యాక్షన్ ఎపిసోడ్ ?

Published on Jan 19, 2025 7:01 AM IST

ప్రశాంత్ నీల్ – ఎన్టీఆర్ కలయికలో రాబోతున్న సినిమా షూటింగ్, ఈ జనవరి నాలుగో వారం నుంచి మంగళూరులో ప్రారంభం కానుందని రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, వచ్చే నెల రెండో వారంలో జరిగే షెడ్యూల్ లో ఎన్టీఆర్ కూడా షూట్ లో జాయిన్ కానున్నాడని టాక్ నడుస్తోంది. ఎన్టీఆర్ పై ఓ యాక్షన్ ఎపిసోడ్ ను ప్రశాంత్ నీల్ ప్లాన్ చేశాడట. ఈ మూవీ టైటిల్ ‘డ్రాగన్‌’ అని ప్రచారంలో ఉంది. ఐతే, ‘డ్రాగన్‌’ సినిమాని ఎన్టీఆర్ కెరీర్ లోనే అత్యుత్తమ సినిమాల్లో ఒకటిగా చేయాలని ప్రశాంత్ నీల్ ప్రయత్నం చేస్తున్నాడట. అందుకే, ఈ సినిమా స్క్రిప్ట్ కోసం ప్రశాంత్ నీల్ చాలా టైమ్ తీసుకున్నాడట.

కాబట్టి, ఇప్పటి వరకూ ప్రశాంత్ నీల్ తీసిన అన్ని సినిమాల్లోకల్లా బెస్ట్ సినిమా ఇదే అవుతుందని అంచనాలు ఉన్నాయి. ఆ మధ్య ఎన్టీఆర్ తో చేయబోయే సినిమా గురించి ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ.. ‘ఆడియన్స్ ఊహించని స్థాయిలో ఈ మూవీని తీస్తున్నాను. ఎన్టీఆర్ పై అభిమానంతో ఈ సినిమా చేస్తున్నాను అని ఆయన పేర్కొన్నారు. మొత్తానికి భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ‘ప్రశాంత్ నీల్ – ఎన్టీఆర్’ సినిమా గురించి నిత్యం ఏదొక రూమర్ వినిపిస్తూనే ఉంది. మైత్రీ మూవీ మేకర్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు