విజయ్ దేవరకొండ హీరోగా శ్యామ్ సింగ రాయ్ ఫేమ్ ‘రాహుల్ సంకృత్యాన్’ దర్శకత్వంలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఐతే, ఈ సినిమాలో మరో అతిథి పాత్ర ఉందని, ఆ పాత్రలో బాలీవుడ్ సీనియర్ హీరో సంజయ్ దత్ కనిపిస్తున్నాడని తాజాగా టాక్ నడుస్తోంది. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో చూడాలి. ఈ సినిమా ఘాట్ ఈ నెలలో మూడో వారం నుంచి స్టార్ట్ కానుందని తెలుస్తోంది. మొదటి షెడ్యూల్ లో విజయ్ దేవరకొండ ఎంట్రీ సీన్స్ ను షూట్ చేస్తారట.
ఇక, ఈ సినిమాలో విజయ్ దేవరకొండ పూర్తిగా సరికొత్త గెటప్ లో కనిపిస్తాడని.. ముఖ్యంగా విజయ్ లుక్ చాలా కొత్తగా ఉంటుందని టాక్ నడుస్తోంది. కాగా, 1854-78 మధ్య కాలంలో జరిగే కథ కాబట్టి, సినిమాలో చాలా వేరియేషన్స్ ఉంటాయని తెలుస్తోంది. పైగా ఆర్నాల్డ్ వోస్లూ ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. మరి నిజంగానే ఆయన ఈ సినిమాలో నటిస్తే కచ్చితంగా ఈ సినిమాకి ప్లస్ అవుతుంది. ఎంతైనా ‘రాహుల్ సంకృత్యాన్’ దర్శకత్వంలో నాని హీరోగా వచ్చిన శ్యామ్ సింగ రాయ్ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. దీంతో, విజయ్ దేవరకొండ సినిమా పై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి.