‘ఉస్తాద్ భగత్ సింగ్’ కొత్త పోస్టర్.. పండుగ తెస్తున్నారుగా!

Ustaad Bhagat Singh

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ అవైటెడ్ చిత్రమే “ఉస్తాద్ భగత్ సింగ్” (Ustaad Bhagat Singh). దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న సాలిడ్ మాస్ ఎంటర్టైనర్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్లు, రీసెంట్ సాంగ్ ఫ్యాన్స్ లో మంచి జోష్ నింపాయి. ఇవి కాకుండా నేడు ఓ సరికొత్త పోస్టర్ ని కూడా మేకర్స్ వదిలారు.

తన ఉస్తాద్ భగత్ సింగ్ తో కలిసి హరీష్ శంకర్ చెయ్యిత్తిన పిక్ తో మేకర్స్ ఈ రథ సప్తమి కానుకగా విడుదల చేశారు. మరి ఇందులో పవన్ కళ్యాణ్ తన మార్క్ స్టైలిష్ లుక్ లో కనిపిస్తుండగా హరీష్ శంకర్ ఒక పెద్ద పండుగని తెస్తున్నారు అంటూ ప్రామిస్ చేస్తున్నారు. అలాగే అప్డేట్స్ కూడా త్వరలోనే మొదలు పెడుతున్నట్టు కన్ఫర్మ్ చేశారు. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు. అలాగే ఈ మార్చ్ లోనే రిలీజ్ కి సన్నాహాలు చేస్తున్నారు.

Exit mobile version