గర్జిస్తున్న అల్లూరి సీతారామరాజు…సరికొత్త పోస్టర్ విడుదల!

Published on Dec 6, 2021 4:36 pm IST

రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లు హీరోలుగా నటిస్తున్న చిత్రం రౌద్రం రణం రుధిరం. ఈ చిత్రం లో అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్, కొమురం భీమ్ పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ లు నటిస్తున్నారు. ఈ చిత్రం లో అలియా భట్, ఒలివియా మోరిస్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అజయ్ దేవగన్, శ్రియ శరణ్, సముద్ర ఖని లు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం ఎంఎం కీరవాణి అందిస్తున్నారు. భారీ బడ్జెట్తో డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 7 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

ఈ చిత్రం కి సంబంధించిన ప్రచార చిత్రాలు, విడియోలు, పాటలు విడుదలై ప్రేక్షకులను అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రం విడుదల తేదీ దగ్గర పడుతుండటం తో సినిమా కి సంబందించిన ప్రమోషన్స్ ను చిత్ర యూనిట్ వేగవంతం చేయడం జరిగింది. ఈ చిత్రం కి సంబంధించిన ట్రైలర్ ను డిసెంబర్ 9 వ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. తాజాగా నేడు కొమురం భీమ్ పోస్టర్ ఉదయం విడుదల కాగా ప్రేక్షకులని, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. తాజాగా సాయంత్రం 4 గంటలకు అల్లూరి సీతారామరాజు పాత్రకి సంబంధించిన. రామ్ చరణ్ పోస్టర్ ను చిత్ర యూనిట్ విడుదల చేయడం జరిగింది.

ఈ పోస్టర్ లో రామ్ చరణ్ గర్జిస్తూ మరింత అగ్రెసివ్ గా కనిపిస్తున్నారు. ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. అభిమానులు లైక్స్ కొడుతూ, షేర్ చేస్తూ తమ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :