కేక పుట్టిస్తున్న ‘ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్’ కొత్త పోస్ట‌ర్

కేక పుట్టిస్తున్న ‘ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్’ కొత్త పోస్ట‌ర్

Published on Jun 12, 2024 1:28 PM IST

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్య‌ణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన క్ష‌ణం రానే వ‌చ్చింది. “కొణిదెల ప‌వ‌న్ క‌ళ్యాణ్ అనే నేను..” అంటూ ప‌వ‌న్ ప్ర‌మాణ‌స్వీకారం చేసిన ఘ‌ట్టాన్ని చూసి అభిమానులు సంతోషంతో ఊగిపోతున్నారు. వారి సంతోషాన్ని మ‌రింత పెంచేస్తూ ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్ ‘ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్’ మూవీ నుండి ఓ సాలిడ్ పోస్ట‌ర్ ను రిలీజ్ చేశారు.

పూర్తిగా యాక్ష‌న్ మోడ్ లో ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ పోస్ట‌ర్ ను ‘ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్’ మేక‌ర్స్ రిలీజ్ చేశారు. ఈ పోస్ట‌ర్ చూసి ప‌వ‌న్ అభిమానులు కేక‌లు పెడుతున్నారు. ప‌ర్ఫెక్ట్ టైమ్ లో ప‌ర్ఫెక్ట్ పోస్ట‌ర్ రిలీజ్ చేశారంటూ మూవీ మేక‌ర్స్ కు థ్యాంక్స్ చెబుతున్నారు.

ఇక ‘ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్’ సినిమా ఇప్ప‌టికే షూటింగ్ జ‌రుపుకుంటుండ‌గా, ఈ సినిమాను పవ‌ర్ఫుల్ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ గా చిత్ర యూనిట్ తెర‌కెక్కిస్తోంది. ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా న‌టిస్తోండ‌గా అశుతోష్ రానా, గౌత‌మి త‌దిత‌రులు ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు