సీరియస్ లుక్ తో గాడ్సే సరికొత్త పోస్టర్!

Published on Oct 15, 2021 9:00 pm IST


సత్యదేవ్ టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. విభిన్న కథాంశాలతో సినిమాలు చేస్తూ ప్రేక్షకులని, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నారు. గాడ్సే అంటూ ఇటీవల తన చిత్రాన్ని ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. టైటిల్ తోనే ఈ చిత్రం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తాజాగా ఈ చిత్రం నుండి మరొక పోస్టర్ ను చిత్ర యూనిట్ విడుదల చేయడం జరిగింది. ఈ పోస్టర్ లో సత్యదేవ్ చాలా సీరియస్ గా ఉన్నారు. మాస్ లుక్ తో ఉన్న ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. దసరా పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టర్ ను విడుదల చేయడం జరిగింది. ఈ చిత్రాన్ని ck స్క్రీన్స్ పతాకం పై సి. కళ్యాణ్ నిర్మిస్తున్నారు. గోపి గణేష్ రచన దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం లో ఐశ్వర్య లక్ష్మీ సత్యదేవ్ సరసన హీరోయిన్ గా నటిస్తుంది.

సంబంధిత సమాచారం :