నాగ చైతన్య “కస్టడీ” నుండి ఇంట్రెస్టింగ్ పోస్టర్ రిలీజ్!

Published on Mar 22, 2023 2:00 pm IST


టాలీవుడ్ యంగ్ హీరో, అక్కినేని నాగ చైతన్య హీరోగా, కృతి శెట్టి హీరోయిన్ గా డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ కస్టడీ. ఈ చిత్రం ను మే 12, 2023 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలకి ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి సూపర్ రెస్పాన్స్ వస్తోంది.

తాజాగా ఈ చిత్రం నుండి సరికొత్త పోస్టర్ ను విడుదల చేసారు మేకర్స్. ఉగాది పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ, హీరో హీరోయిన్ లతో ఉన్నటువంటి పోస్టర్ ను విడుదల చేసారు. ఈ పోస్టర్ చాలా ఆసక్తికరంగా ఉంది. శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతం ఇళయరాజా, యువన్ శంకర్ రాజా లు అందిస్తున్నారు. ఈ చిత్రం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

సంబంధిత సమాచారం :