ఇండియన్ సినిమా పరిశ్రమలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపుదిద్దుకుంటున్న పౌరాణిక చిత్రం ‘రామాయణ’కు సంబంధించిన సరికొత్త పోస్టర్లు విడుదలయ్యాయి. ‘దంగల్’ ఫేమ్ నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ బిగ్ బడ్జెట్ విజన్ లో బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతాదేవిగా, రవి దూబే లక్ష్మణుడిగా నటిస్తుండగా, కన్నడ రాకింగ్ స్టార్ యష్ రావణాసురుడిగా పవర్ఫుల్ అవతార్‌లో కనిపిస్తున్నారు.
ప్రఖ్యాత DNEG సంస్థ అందించే విజువల్ ఎఫెక్ట్స్‌తో నమిత్ మల్హోత్రా ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ బిగ్ విజువల్ వండర్ మొదటి భాగం 2026 దీపావళి కానుకగా ప్రపంచవ్యాప్తంగా ఐమాక్స్ ఫార్మాట్లో థియేటర్లలోకి రాబోతోంది. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్‌గా ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తుండగా, ధర్మ ప్రొడక్షన్స్, టి-సిరీస్ మరియు మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ సంస్థలు కూడా ఈ భారీ ప్రాజెక్ట్‌లో భాగస్వాములుగా ఉన్నాయి.
