సుశాంత్ సింగ్ కేసు – నటి రియా చక్రవర్తికి కొత్త చిక్కు

Published on Jul 13, 2022 3:48 pm IST

దివంగత బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కు సంబంధించిన డ్రగ్స్ కేసులో రియా చక్రవర్తి అరెస్టయ్యాక వార్తల్లో నిలిచింది. ఆమె జైలుకు కూడా వెళ్లి నెల రోజుల తర్వాత బెయిల్‌ పై విడుదలైంది. ఇప్పుడు మరోసారి తను వార్తల్లో నిలిచింది.

రియా చక్రవర్తి పై NCB ఛార్జ్ షీట్ వేయడం జరిగింది. దానిలో, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ యొక్క మాదకద్రవ్య వ్యసనాన్ని ప్రోత్సహించినట్లు మరియు అతని డబ్బును డ్రగ్స్ కొనడానికి ఉపయోగించినట్లు పేర్కొనడం జరిగింది. ఇది రియాకు పెద్ద ఇబ్బంది అని చెప్పాలి. ఆమె ఇప్పుడు ఏమి చేస్తుందో చూడాలి. తన డ్రగ్ కేసులో బెయిల్ పొందడానికి, రియా దేశంలోనే అత్యంత ఖరీదైన లాయర్లలో ఒకరిని నియమించుకుంది. మరి ఈసారి ఏం చేస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం :