“గీతా ఆర్ట్స్ 2” నుంచి అల్లు అరవింద్ సమర్పణలో ప్రొడక్షన్ నెంబర్ 8 స్టార్ట్.!

Published on Jun 30, 2022 11:30 am IST

మన తెలుగు సినిమా దగ్గర ఉన్నటువంటి దిగ్గజ నిర్మాతలలో అలాగే మోస్ట్ సక్సెస్ ఫుల్ నిర్మాణ సంస్థలో గీతా ఆర్ట్స్ మరియు ఆ నిర్మాణ సంస్థ అధినేత అల్లు అరవింద్ కూడా ఒకరు. మరి వీరి బ్యానర్ నుంచి ఓ సినిమా వస్తుంది అంటే ఎలాంటి డౌట్ లేకుండా ఆడియెన్స్ కి మంచి ట్రీట్ ఇస్తుంది అనే నమ్మకం కలుగుతుంది.

మరి దీనికి సక్సెసర్ గా బన్నీ వారు నిర్మాతగా అల్లు అరవింద్ సమర్పణలో మాంచి కంటెంట్ ఓరియెంటెడ్ మీడియం బడ్జెట్ సినిమాలను తెరకెక్కిస్తున్న మంచి విజయాలతో దూసుకెళ్తున్న బ్యానర్ గీతా ఆర్ట్స్ 2. మరి వీరి నుంచి ఇప్పుడు ప్రొడక్షన్ నెంబర్ 8 లాంచ్ అయ్యింది.

యంగ్ దర్శకుడు తేజ మర్ని తో శ్రీకాంత్ మరియు వరలక్ష్మి శరత్ కుమార్, రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ కీలక పాత్రల్లో నటించనున్న ఈ చిత్రం ఈరోజు ముహూర్తంతో స్టార్ట్ అయ్యింది. జగదీష్ చీకటి సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాకు శక్తికాంత్ కార్తీక్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే మరిన్ని వివరాలు ఈ చిత్రంపై రానున్నాయి.

సంబంధిత సమాచారం :