ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి నెక్స్ట్ అనౌన్సమెంట్ వచ్చేస్తుంది.!

Published on Mar 23, 2022 2:00 pm IST

మన తెలుగు సినిమా నుంచి ఫస్ట్ ఎవర్ సూపర్ హీరో సినిమాగా టాలెంటెడ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ ఓ భారీ పాన్ ఇండియా సినిమా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఆ సినిమానే “హను మాన్”. యంగ్ హీరో తేజ సజ్జ హీరోగా యంగ్ బ్యూటీ అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించిన ఈ సూపర్ హీరో సినిమాతో ప్రశాంత్ వర్మ పేరు ఇండస్ట్రీ వర్గాల్లో మంచి హాట్ టాపిక్ గా నడుస్తూ వస్తుంది. తన ప్రతి సినిమాతో కూడా ఆశ్చర్య పరుస్తూ వస్తున్న ప్రశాంత్ తన సినిమాలకి ఏకంగా ఒక సినిమాటిక్ యూనివర్స్ ను కూడా అనౌన్స్ చేసాడు.

మరి దీని నుంచి ఇప్పుడు లేటెస్ట్ గా ఇంకో క్రేజీ అనౌన్సమెంట్ రాబోతున్నట్టుగా ఇప్పుడు కన్ఫర్మ్ చేసాడు. తాను చేయబోతే మరో కొత్త ప్రాజెక్ట్ కి సంబంధించి ఈరోజు సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు రిలీజ్ చేస్తున్నట్టు ఆసక్తికర పోస్టర్ ని డిజైన్ చేసి రిలీజ్ చేసారు. ఇది కూడా మంచి గ్రాండ్ గానే ఉండేలా అనిపిస్తుంది. ప్రస్తుతం ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య తనయుడిని హీరోగా అనౌన్స్ చేస్తున్నట్టు టాక్ ఉంది. మరి దీనిపైనే ఈ అప్డేట్ ఏమో వేచి చూడాలి.

సంబంధిత సమాచారం :