లేటెస్ట్..బెల్లంకొండ గణేష్ “స్వాతి ముత్యం” రిలీజ్ కొత్త డేట్ ఫిక్స్.!

Published on Aug 10, 2022 10:15 am IST


మన టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడు బెల్లంకొండ శ్రీనివాస్ ఆల్రెడీ హీరోగా తనకంటూ తెలుగు సహా హిందీ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. మరి తన సోదరుడు బెల్లంకొండ గణేష్ కూడా హీరోగా పరిచయం అయ్యి చేసిన చిత్రమే “స్వాతి ముత్యం”. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ వర్ష బొల్లమ్మ హీరోయిన్ గా నటించగా ఈ చిత్రాన్ని దర్శకుడు లక్ష్మణ్ కే కృష్ణ దర్శకత్వం వహించారు.

అయితే ఈ సినిమాని ఇది వరకే రిలీజ్ చేయాల్సి ఉండగా మేకర్స్ అయితే ఈ రిలీజ్ ని వాయిదా చేస్తున్నట్టుగా తెలిపారు. మరి ఇప్పుడు కొత్త రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. ఈ సినిమాని దసరా కానుకగా అక్టోబర్ 5న రిలీజ్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. ఇక ఈ చిత్రానికి అయితే మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించారు. మరి బెల్లంకొండ గణేష్ డెబ్యూ పై కూడా మంచి బజ్ ఉంది.

సంబంధిత సమాచారం :