‘ఆక్సిజన్’ విడుదల తేదీ ఖరారు !
Published on Nov 23, 2017 5:50 pm IST

అగ్రెసివ్ హీరో గోపీచంద్ హీరోగా ఏ.ఎం.జ్యోతికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘ఆక్సిజన్’. ఈ మూవీ లో గోపీచంద్ సరసన రాశీఖన్నా, అను ఇమ్యాన్యుల్ కథానాయికలుగా నటించారుదే . యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని శ్రీ సాయిరామ్ క్రియేషన్స్ పతాకంపై ఎస్.ఐశ్వర్య నిర్మించారు.

ఈ సినిమా నిర్మాణాంత‌ర కార్యక్రమాలు పూర్తి చేసుకొని నవంబర్ 30 న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే పలుసార్లు వాయిదా పడిన ఈ సినిమా ఈసారి తప్పకుండా విడుదలకానుందని సమాచారం. యువన్ శంకర్ రాజా అందించిన ఈ సినిమా పాటలు ఇప్పటికే పాపులర్ అయ్యాయి.

 
Like us on Facebook