రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న ‘పద్మావత్’ !

నిన్న మొన్నటి వరకు పలు వివాదాలకు కారణమైన బాలీవుడ్ చిత్రం ‘పద్మావత్’ ఎట్టకేలకు అన్ని ఇబ్బందుల్ని అధిగమించి విడుదలకు సిద్ధమైంది. సంజయ్ లీలా బన్సాలి డైరెక్ట్ చేసిన ఈ చిత్రం ఈ నెల 25న విడుదలకానుందట. దీనికి సంబందించిన అధికారిక సమాచారం త్వరలోనే వెలువడనుంది.

ఇటీవలే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సెన్సార్ బోర్ U/A సర్టిఫికెట్ ను జారీ చేసింది. స్టార్ నటి దీపికా పాడుకొనే ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో రణబీర్ సింగ్ అల్లాఉద్దీన్ ఖిల్జీగా కనిపించనుండగా షాహిద్ కపూర్ రతన్ సింగ్ పాత్రలో నటించాడు.