అఖిల్ ‘ఏజెంట్’ రిలీజ్ అప్పుడే ?

అఖిల్ ‘ఏజెంట్’ రిలీజ్ అప్పుడే ?

Published on Dec 26, 2022 3:00 PM IST

దర్శకుడు సురేందర్ రెడ్డి ప్రస్తుతం ‘ఏజెంట్’ అంటూ అక్కినేని అఖిల్ తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ స్టైలిష్ స్పై థ్రిల్లర్ నుంచి ఒక అప్ డేట్ వచ్చింది. ఈ చిత్రం 2023 సంక్రాంతి సందర్భంగా విడుదల కానుందని కూడా వార్తలు వచ్చాయి. కానీ ఈ చిత్రం ఫిబ్రవరి 2023లో విడుదల కానుందని తెలుస్తోంది. ఆల్ రెడీ మేకర్స్ తేదీని లాక్ చేశారని, జనవరి 1న సరికొత్త పోస్టర్‌తో గ్రాండ్‌గా ప్రకటిస్తారని తెలుస్తోంది.

ఇక ఈ సినిమా ఇంటర్వెల్ సీక్వెన్స్ లో భారీ ట్విస్ట్ ఉంటుంది అని, అఖిల్ క్యారెక్టర్ పై రివీల్ అయ్యే ఈ ట్విస్ట్ సినిమా మొత్తానికి గుండెకాయ లాంటిది అని.. ఈ సినిమా స్క్రీన్ ప్లే కూడా చాలా డిఫరెంట్ గా ఉండబోతుంది అని తెలుస్తోంది. ఈ సినిమాలో అఖిల్ తన నరాలు కూడా బలంగా ఎలివేట్ అయ్యేలా కండలు పెంచి మరీ నటిస్తున్నాడు. ఈ చిత్రంలో అఖిల్ రెండు వేరియేషన్స్ ఎలివేట్ అయ్యేలా రెండు లుక్స్ లో సాలిడ్ పర్సనాలిటీలో కనిపించనున్నాడు.

అలాగే ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు. సాక్షీ వైద్య హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో మమ్ముట్టి ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు