రాజమౌళి సినిమా పై మరో కొత్త పుకారు ?

రాజమౌళి సినిమా పై మరో కొత్త పుకారు ?

Published on Oct 31, 2022 11:05 PM IST

రాజమౌళి – మహేష్ బాబు సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ? అంటూ మహేష్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. మరోపక్క ఈ సినిమా గురించి ఏదొక రూమర్ వినిపిస్తూనే ఉంది. తాజాగా మరో కొత్త రూమర్ వైరల్ అవుతుంది. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పడుకోణె నటించబోతుందని టాక్ నడుస్తోంది. నిజానికి ఈ సినిమాకి సంబంధించి ఇంకా నటీనటుల ఎంపిక జరగలేదు.

కాకపోతే.. ఈ సినిమా రచయిత విజయేంద్రప్రసాద్‌ రాసిన కథలో కథానాయక గా దీపికా పడుకోణె అయితే బాగుంటుందని మేకర్స్ ఫీల్ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇక విజయేంద్రప్రసాద్‌, మహేశ్‌ కోసం ఒక పవర్ ఫుల్ స్క్రిప్టు రాశారట. ఆఫ్రికా బ్యాక్‌ డ్రాప్‌ లో అడ్వెంచర్ థ్రిల్లర్‌ గా ఈ కథా నేపథ్యం సాగుతుందని తెలుస్తోంది. నిజంగానే మహేష్ – రాజమౌళి కలయికలో ఒక అడ్వెంచర్ థ్రిల్లర్‌ వస్తే కచ్చితంగా అది అన్ని వర్గాల ప్రేక్షకులను థ్రిల్ చేస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు