‘రాజా ది గ్రేట్’ సినిమాలో యాడ్ కానున్న కొత్త సన్నివేశాలు !
Published on Nov 2, 2017 1:43 pm IST

రవితేజ కమ్ బ్యాక్ సినిమా ‘రాజా ది గ్రేట్’ మంచి సక్సెస్ సాదించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో రవితేజకు కావాల్సిన, ఆయన కోరుకున్న విజయం దక్కినట్లైంది. ఎంటర్టైన్మెంట్ ప్రధానంగా రూపొందిన ఈ చిత్రం అన్ని ఏరియాల్లోనూ డిస్ట్రిబ్యూటర్లకు మంచి లాభాల్ని తెచ్చిపెడుతోంది. దీంతో దర్శక నిర్మాతలు సినిమా మైలేజ్ ను ఇంకాస్త పెంచే ప్రయత్నాలు చేస్తున్నారు.

అందులో భాగంగానే ఇది వరకు లేనటువంటి మూడు సన్నివేశాల్ని ఈ శనివారం నుండి యాడ్ చేస్తున్నారట. ఇవి కూడా కామెడీని జనరేట్ చేసే సన్నివేశాలని తెలుస్తోంది. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రాన్ని అనిల్ రావిపూడి డైరెక్ట్ చేయగా మెహ్రీన్ కౌర్ హీరోయిన్ గా నటించింది.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook