“అఖండ” లో థమన్ దెబ్బకు కొత్త స్పీకర్లు కొంటున్నారట.!

Published on Jan 23, 2022 9:00 am IST


నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కించిన భారీ సినిమా “అఖండ” వారి కెరీర్ లోనే కాకుండా టాలీవుడ్ లో కూడా ఎంత పెద్ద హిట్ అయ్యిందో చూసాం. ఇక ఈ హిట్ తర్వాత ఈ భారీ సినిమా ఓటిటి లోకి వచ్చి నెక్స్ట్ లెవెల్ రెస్పాన్స్ ని కూడా అందుకుంది.

అయితే ఈ సినిమా భారీ సక్సెస్ లో ప్రతి సాలిడ్ సీన్ కి తగ్గట్టుగా అదిరిపోయే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చిన సంగీత దర్శకుడు థమన్ కి కూడా కీలక పాత్ర ఉందని చెప్పక్కర్లేదు. తన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కోసమే సినిమాకి కూడా వెళ్లిన వారు లేకపోలేరు. అయితే ఆ టైం లో థియేటర్స్ లోనే థమన్ దెబ్బకి సౌండ్ బాక్సులు బద్దలయ్యాయని థియేటర్స్ సౌండ్ సిస్టం ని మారుస్తున్నామని కొన్ని ప్రకటనలు కూడా చూసాము.

ఇక ఇప్పుడు ఓటిటిలో అఖండ రిలీజ్ అయ్యాక కేవలం థమన్ సంగీతం కోసం కొత్త స్పీకర్ లు కొంటున్నామని థమన్ కి చెబుతున్నారు. ఓవర్సీస్ లో ఆడియెన్స్ కి సౌండ్ బాక్స్ కంపెనీ లు థాంక్స్ చెబుతున్నారట. ఇప్పుడు మళ్ళీ సేల్స్ పెరిగాయట. దీనితో థమన్ కూడా వారికి నవ్వుతూ రిప్లై ఇచ్చాడు.

సంబంధిత సమాచారం :