సరికొత్త టెన్షన్..ఈ బలమైన కారణం తో “RRR” వాయిదా పడనుందా?

Published on Dec 25, 2021 7:05 am IST

ప్రస్తుతం పాన్ ఇండియన్ వైడ్ మంచి అంచనాలు నెలకొల్పుకున్న భారీ చిత్రం “రౌద్రం రణం రుధిరం”. దర్శక ధీరుడు రాజమౌళి మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో తెరకెక్కించిన ఈ భారీ పాన్ ఇండియా మల్టీస్టారర్ రిలీజ్ అన్ని వైపులా సిద్ధం అవుతూ పెద్ద ఎత్తున ప్రమోషన్స్ ని జరుపుకుంటుంది. అయితే గత కొంతకాలంగా ఈ సినిమా వేధిస్తున్న వాయిదా భూతం టెన్షన్ మళ్లీ పట్టుకున్నట్టు తెలుస్తోంది. దీనికి బలమైన కారణం కూడా లేకపోలేదు.

ప్రస్తుతం దేశంలో మళ్లీ మారుతున్న పరిస్థితులు రీత్యా ఈ సినిమా వాయిదా పడనుంది అని టాక్ వైరల్ అవుతుంది. ఆల్రెడీ మహారాష్ట్ర లో నైట్ కర్ఫ్యూ విధించారు అలాగే ఇదే బాటలో మన దక్షిణాదిలో కూడా మరికొన్ని రాష్ట్రాల్లో కూడా నిబంధనలు పెట్టడం చూస్తున్నట్టు తెలుస్తోంది దీనితో ఈ సినిమా రిలీజ్ నాటికి పరిస్థితి ఇలానే ఉంటే వసూళ్ళ పై బాగా ప్రభావం చూపడం గ్యారెంటీ. అందుకే ఈ బిగ్ బడ్జెట్ సినిమా వాయిదా పడే సూచనలు ఉన్నాయని సరికొత్త టెన్షన్ మొదలైంది. మరి వేచి చూడాలి ఏం జరుగుతోంది అనేది.

సంబంధిత సమాచారం :